calender_icon.png 3 November, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలి..

01-11-2025 08:33:56 PM

* అడ్రస్ లేని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు..

* మాజీ మంత్రి రామన్న ధ్వజం...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లాను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు.  తేమ శాతం సాకు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని అన్నారు. ఆదిలాబాద్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.... జిల్లాలో రైతులు పత్తి కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే రైతులకు అండగా నిలవాల్సిన స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అడ్రస్ లేకుండా పోయరని మండిపడ్డారు. గతంలో తాము అధికారంలో ఉన్నపుడు తేమ శాతం ఎక్కువగా ఉన్న కొనుగోలు చేశామని గుర్తు చేశారు. తేమ శాతం విషయంలో సీసీఐ అధికారులను కలిస్తామన్నారు. రైతులకు అండగా ఉండేందుకు త్వరలో పార్టీ తరఫున ఆందోళనలు చేపడతామన్నారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ రైతు నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకుపోవడంలో విఫలమవుతున్నారనీ అన్నారు.

గత కొంతకాలంగా రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొని ఆర్థిక నష్టాలతో రబి పంటకు పెట్టుబడి లేక, రైతులకు అందించాల్సిన నష్టపరిహారాన్ని సైతం అందించలేక  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  రైతులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం తగదన్నారు. జిల్లా కలెక్టర్ కు పలుసార్లు రైతు సమస్యలపై విన్నపించిన స్పందించకపోవడం శోచనీయం అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి రైతులపక్షాన జిల్లా బిఆర్ఎస్ పార్టీ మరోసారి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం రైతుకు జరిగిన నష్టాలపై కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో పూర్తిగా విఫలమవుతున్నారన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు 25 వేల నష్టపరిహారాన్ని అందించాలేనీ లేనియెడల ఉద్యమానికి తెరలెత్తమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రౌతు మనోహర్, యాసం నర్సింగరావు, మెట్టు ప్రహ్లాద్,సేవ్వా జెగదిస్, దేవిధస్, ఉగ్గే విట్టల్, గెడం రాజు తదితరులు పాల్గొన్నారు.