calender_icon.png 2 November, 2025 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్ అదాలత్ ను సద్వినియోగ పరచుకోవాలి

01-11-2025 08:31:24 PM

జూనియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): ఈనెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కోర్టు ఆవరణలో వచ్చే లోక్ అదాలత్ గురించి పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ మాట్లాడుతూ... పలు రకాల కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. సివిల్ కేసులు, మనీ రికవరీ, యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మ్యారేజ్ కేసుల్లో లోక్ అదాలత్‌లో రాజీ పడవచ్చని పేర్కొన్నారు. అన్ని రకాల సివిల్ కేసుల్లో కూడా సంవత్సరాల తరబడి కోర్ట్ ల చుట్టూ తిరిగి మీ విలువైన సమయాన్ని, డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు. దీంతో  డబ్బు ,సమయం రెండు కూడా ఆదా అవుతాయని, అదేవిధంగా సివిల్ కేసులో చెల్లించినటువంటి కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుందని తెలిపారు.