18 April, 2026 | 8:22 AM

పోలీసు సేవా పతకాల ప్రకటన

02-06-2025 02:52 AM

రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా నేడు ప్రదానం

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం పోలీసుల సేవా పతకాలను ప్రకటించింది. పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసిన 625 మందికి పతకాలు లభిం చాయి. అందులో గ్రేహౌండ్స్‌కు చెం దిన తొమ్మిది మందికి శౌర్య పతకం, 16 మందికి మహోన్నత సేవా పత కం, 92 మంది ఉత్తమ సేవా పతకానికి ఎంపిక చేశారు.

47 మందికి క ఠిన సేవా పతకం, 461 మంది సేవా పతకానికి ఎంపికయ్యారు. అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవ, నలుగురికి ఉన్నత సేవ, 17 మందికి సేవా పతకాలు లభించా యి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెం ట్ శాఖలో ఒకరికి ఉత్తమ సేవ, ఐదుగురికి సేవ పతకాలు లభించాయి.

స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఒకరికి మహోన్నత సేవ, ముగ్గురికి ఉత్తమ సేవ, 15 మంది సేవా పతకాలకు ఎంపికయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ శాఖలో ఇద్దరు శౌ ర్య పతకం, ఒకరికి మహోన్నత పత కం, ముగ్గురికి ఉత్తమ సేవ, 14 మం దికి సేవ పతకాలకు ఎంపికయ్యారు.