18 April, 2026 | 10:06 AM

ప్రశాతంగా ముగిసిన ఎడ్‌సెట్

02-06-2025 02:50 AM

83 శాతం మంది అభ్యర్థుల హాజరు

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): బీఈడీ కోర్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీఎడ్‌సెట్--2025 ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 83 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ బీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండు సెషన్లలో నిర్వహించిన పరీక్షల్లో 32,106 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షల్లో సెషన్-1కు 74, సెషన్-2 కు 73 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.