25 April, 2026 | 5:24 PM

Breaking News

గురుకులాల ప్రగతిలో గురువుల పాత్ర అమోఘం   •   బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •  

ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం పోలీసుల చలివేంద్రం

25-04-2026 03:40 PM

- మంచిర్యాల డీసీసీ భాస్కర్ 

- కాల్ టాక్స్ ఫ్లైఓవర్ టీ జంక్షన్ వద్ద చలివేంద్రం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పోలీసులంటే శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పనిచేస్తారని, అదే వారి ప్రధమ ముఖ్య భూమిక అని అందరూ అనుకుంటారు. కానీ ప్రజల సంక్షేమం కూడా తమ భాధ్యత అని బెల్లంపల్లి పోలీసులు నిరూపించారు. వేసవి కాలాన్ని పురస్కరించుకొని ఎండ దెబ్బ నుండి ప్రజలను కాపాడాలనే సదుద్దేశంతో బెల్లంపల్లి కాల్ టెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి టీ జంక్షన్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శనివారం మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ. వేసవికాలంలో ప్రయాణించే ప్రజల దహర్ని తీర్చడం కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. వడదెబ్బ,డిహైడ్రేషన్ నుంచి ప్రయాణికులను రక్షించేందుకు ఈ చలివేంద్రం ముఖ్య భూమిక పోషిస్తుందన్నారు. దాహం తీర్చడం వల్ల ఎండ దెబ్బ ముప్పు నుంచి ప్రయాణికులు రక్షణ పొందుతారన్నారు. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరడంతో నిప్పులు కురిపిస్తున్న ఎండ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందన్నారు.

ఈ నేపథ్యంలో ప్రజలు వేసవిలో ప్రయాణించవద్దన్నారు. పిల్లలను సైతం ఎండలో తిరగనియద్దన్నారు. పిల్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరారు. పిల్లలకు వాహనాలు ఇచ్చి ఎండలో తిరిగి అవకాశాన్ని నివారించాలని కోరారు. రోడ్డు ప్రమాదాలతో పాటు వడదెబ్బలకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రజల కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల బెల్లంపల్లి పోలీసులను డీసీపీ భాస్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, టూ టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, తాళ్ళు గురజాల ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.