18 July, 2026 | 12:53 AM

పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా మారొద్దు

18-07-2026 12:53 AM

నల్లగొండ క్రైం, జూలై 17 : పోలీసులు అధికార పార్టీకి తొత్తుగా ఆ పార్టీ కార్యకర్తగా వ్యవహరించవద్దని ధర్మంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోని చెన్నుగూడెం, తొరగల్, అప్పాజీపేట, కొత్తపల్లి గ్రామంలో భూముల ఆక్రమణ వివాదంపై శుక్రవారం ఆయన నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

చెన్నుగూడెంలో 30 ఏళ్లుగా కబ్జాలో ఉన్న భూమిని సర్పంచి ఆక్రమించుకోవడం అందుకు నల్గొండ రూరల్ ఎస్త్స్ర సహకరించడం సమంజసం కాదన్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిని ఏదైనా సమస్య ఉంటే ధర్మంగా చట్టబద్ధంగా ఇరువురికి కూర్చోబెట్టి సమస్య పరిష్కరించాలి తప్ప కాంగ్రెస్ సర్పంచ్ అని తొత్తుగా వ్యవహరించొద్దన్నారు. పదేళ్ల టిఆర్‌ఎస్ పనుల్లో ఎక్కడ ప్రభుత్వ భూములు లాక్కోలేదని,కబ్జాలు చేయలేదని,అక్రమ కేసులు పెట్టించేందుకు పురమాయించలేదన్నారు.

మంత్రి కోమటిరెడ్డి పార్టీలకు సంబంధం లేని వారి పైన కేసులు పెట్టించడం ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. అధర్మంగా వ్యవహరిస్తే పకృతి క్షమించబోదని హెచ్చరించారు. స్టేషన్లో విధులు నిర్వహించే ఎస్‌ఐలు ధర్మంగా ఉండాలన్నారు. త్వరలో మా ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబితేనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల స్వీకరించే పరిస్థితి రావడం దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో అపార్టీ నాయకులు దే ప వెంకటరెడ్డి, రవీందర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి జంగయ్య యాదవ్ నగేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.