6 April, 2026 | 10:46 PM

పోలీస్ కిష్టయ్య కుటుంబానికి అండగా..

02-12-2024 12:10 AM

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్/కామారెడ్డి, డిసెంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ అమరుడు పోలీస్ కిష్టయ్య కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భరోసా ఇచ్చారు. పోలీస్ కిష్టయ్య 15వ వర్థంతి సందర్భంగా ఆయన భార్య పద్మావతి, కుమారుడు రాహూల్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత కలిశారు.

వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కిష్టయ్య కుటుంబానికి దన్నుగా ఉంటుందన్నారు. అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హమీలు అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.