బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పై నిప్పులు చెరిగిన మహిపాల్ రెడ్డి
తూప్రాన్, జూలై 17: గతంలో కాంగ్రెస్ మండల కమిటీలు వేసిన సందర్భంగా అధిష్టానం నిర్ణయించిన కమిటీ నిజమైన కమిటీ గా ఖరారయిన నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి నేతృత్వంలో తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఉన్న గెస్ట్ హౌస్ నుండి నాచారం టెంపుల్ వరకు విజయోత్సవ భారీ బైక్ ర్యాలీ నిర్వహించే క్రమంలో తూప్రాన్ పోలీసులు అడ్డుకొని గెస్ట్ హౌస్ లో నిలిపివేయడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మేము కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ అంత ఇంత కాదని నిజంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గడిచిన ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయని నిలదీశారు. గడిచిన ఎంపీ ఎన్నికలలో మేమంతా సమిష్టిగా కష్టపడి ప్రచారం నిర్వహిస్తే 65 వేల పై చిలుకూ ఓట్లు రావడం జరిగింది. నీ వలన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎలక్షన్ లో మైనస్ అయింది తప్ప పుంజుకోలేదని అన్నారు. ఏది ఏమైనాప్పటికీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరికీ టిక్కెట్ ఇచ్చిన వారికి మేమంతా కష్టపడి పనిచేసి తప్పక గెలిపించుకుంటామని అన్నారు. అనంతరం గెస్ట్ హౌస్ నుండి తూప్రాన్ లింగారెడ్డి గార్డెన్ వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఇందులో మాజీ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, తూప్రాన్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు గరిగే నర్సింగరావు, మనోహరాబాద్ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు సత్యనారాయణ, సిహెచ్ వెంకట్ రెడ్డి, జావేద్ పాష, శశిభూషణ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఎండి. అప్సర్, చిట్టిమిల్ల అనిల్ కుమార్, ఉమర్, అబ్బూరి బాలేష్, కపాలాట రమేష్, శంకర్ యాదవ్, అజర్, సర్పంచ్ నాగరాజుగౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






