10 May, 2026 | 10:56 AM

మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్

10-05-2026 10:11 AM

ఖమ్మం,(విజయక్రాంతి): రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సుడా చైర్మన్ గా నియమితుడైన పువ్వాళ్ల దుర్గాప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మంలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, తనకు సుడా చైర్మన్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపి,శాలువాతో సన్మానించారు. అనంతరం మంత్రి పొంగులేటి హుడా చైర్మన్ ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్,ఓబీసీ సెల్ అధ్యక్షులు పుచ్చలకాయల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.