ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్
ఎస్పీ డాక్టర్ శబరీష్
మహబూబాబాద్, మే 27 (విజయక్రాంతి): ప్రజలకు మరింతగా పోలీసింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులు, ఇబ్బంది నడుచుకోవాలని మహ బూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్ సూచించారు. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ బుధవారం ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, రికార్డులు, సిబ్బంది విధులను పరిశీలించారు. స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత స్నేహపూర్వక వాతావరణం లో సేవలు అందించాలని, దూర ప్రాంతాల నుండి పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలు ప్రస్తుత ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ యువతను గంజా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందన్నారు. గ్రామ స్థాయిలో రాత్రి పహారా విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే తమ పరిధిలో ఉన్న హోటల్స్, లాడ్జ్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తు లు, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా సూచనలు ఇవ్వాలని తెలిపారు. గంజాయికి సంబంధించిన సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే 8712656999 నంబర్‌కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.






