మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు
ములుగు (మహబూబాబాద్) మే 27 (విజయక్రాంతి): మాదకద్రవ్యాల నియంత్రణ కోసం కట్టదిట్టమైన చర్యలు తీసుకోవా లని, రోడ్డు ప్రమాదాల నివారణకు ‘బ్లైండ్ స్పాట్స్’ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలలు, వసతి గృహాల పరిసరాలలో మాదక ద్రవ్యాల విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారి కి డి అడిక్షన్ కేంద్రంలో చికిత్స అందించాలని, పోలీసు జాగిలాలతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని సూచించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జీ తో కలిసి నార్కోటిక్ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత అం శాలపై సంబంధిత జిల్లా అధికారులతో సమీ క్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిషేధిత మాదకద్రవ్యాల సరఫరా, క్రయవిక్ర యాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
ముఖ్యంగా జిల్లా, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిం చాలని, అనుమానిత ప్రాంతాలు, దుకాణా లు, గోదాములు, రహదారుల వద్ద పోలీసు జాగిలాలతో నిరంతరం తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల కు డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యే క సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. మాదకద్రవ్యాలపై సమాచారం అం దించేందుకు ప్రజలు డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డిఓ ప్రతాప్, వరంగల్ నార్కోటిక్ ఈగల్ విభాగం డీఎస్పీ రమేష్ కుమార్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, ఐటీడీఏ డీడీ జనార్ధన్, రవాణా శాఖ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.






