7 July, 2026 | 3:13 AM

300 కోట్ల అక్రమాస్తుల పుట్ట

07-07-2026 02:22 AM

డీఎస్పీ భీమ్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ

నాలుగు రోజుల సోదాల అనంతరం చర్యలు

భీమ్‌రెడ్డి వెనుక రాజకీయ, వ్యాపారులు?

బినామీ పేర్లతో పెట్టుబడులు!

ఈ కోణంలో ఏసీబీ దర్యాప్తు 

సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.300 కోట్ల విలువైన అక్రమాస్తులను కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు.

నాలుగు రోజుల క్రితం డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇల్లు, ఆయన కార్యాలయాలు, అలాగే ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన పలు ప్రాంతా ల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో భారీగా స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల పత్రా లు, నగదు, బంగారంతో పాటు పలు కీలక బ్యాంక్ ఖాతాల వివరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ఆస్తుల ప్రభుత్వ విలువ తక్కువగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ. 300 కోట్ల వరకు ఉం టుందని ఏసీబీ వెల్లడించింది. ‘గత నాలుగు రోజులుగా స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించాం. ఆదాయ వనరులకు, లభించిన ఆస్తులకు ఎక్కడా పొంతన లేదు. ప్రాథమిక ఆధారాలు బలంగా ఉండటంతోనే భీ మ్‌రెడ్డిని అరెస్ట్ చేశాం’ అని అధికారులు వెల్లడించారు.

భీమ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయనను వైద్య పరీక్షల నిమి త్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి, తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. భీమ్‌రెడ్డి వెనుక ఉన్న రాజకీయ, వ్యాపార ప్రముఖులెవరు? బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టారు? అనే కోణంలో ఏసీబీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.