సెన్సెక్స్ షేర్లన్నీ నష్టాల్లోనే!
సెన్సెక్స్ ప్యాక్‌లోని బ్లూచిప్ షేర్ల న్నీ నష్టాల్లోనే ముగిసాయి. అన్నింటికంటే అధికంగా భారతి ఎయిర్‌టెల్ 3.2 శాతం క్షీణించి రూ.1,615 వద్ద ముగిసింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏషియన్ పెయింట్స్, లార్సన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1.5 శాతం మధ్య నష్టపోయాయి. వివిధ రంగాల సూచీల్లో అధికంగా టెలికమ్యూనికేషన్ ఇండెక్స్ 2.18 శాతం తగ్గింది. మెటల్ ఇండెక్స్ 1.77 శాతం, ఆటోమొబైల్ ఇండెక్స్ 1.70 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 1.64 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.59 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 1.39 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 1.37 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.65 శాతం చొప్పున తగ్గాయి.




