calender_icon.png 2 November, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ ఆలయం నిర్మాణం పనులపై అంతర్యం ఏమిటీ..?

01-11-2025 07:31:35 PM

ఎకరానికి వెయ్యి రూపాయలు వసూల్ చేసిన డబ్బులు ఏమయ్యాయో..

అర్ధాంతరంగా నిలిచిన పెద్ద ఎక్లరా హనుమాన్ ఆలయ అభివృద్ధి పనులు..

దేవాదాయ శాఖ నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసిన జుక్కల్ ఎమ్మెల్యే..

బిచ్కుంద (విజయక్రాంతి): హనుమాన్ ఆలయం నిర్మాణంపై రాజకీయ కుట్రలు చేయడం ఏంటని పలువురు గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం చొప్పున హనుమాన్ గుడిలో నిర్మాణానికి ఎకరానికి వెయ్యి రూపాయలు చొప్పున హనుమాన్ ఆలయ నిర్మాణం కోసం వసూల్ చేసిన డబ్బులు ఏమయ్యాయి అంటూ గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి గుడిపై రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామంలో హనుమాన్ ఆలయ పనులు అర్ధంతరంగా నిలిచాయి. గ్రామస్తుల ఆదేశాల మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మకాంతారావు ఆలయ అభివృద్ధి కొరకు దేవాదాయ శాఖ తరుపున 10 లక్షలు రూపాయలను గుడి నిర్మాణం కొరకు నిధులను కేటాయించారు. మధ్యంతరంగా పనులు ఆగిపోవడానికి గల కారణాలు ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

నిధులు మంజూరై మూడు నెలలు గడుస్తున్నప్పటికీ పనులు ప్రారంభించకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ముక్కున వేలేసుకుంటున్నారు. గ్రామ ప్రజలు దీనిపై క్లుప్తంగా విచారించకపోవడం చాలా బాధాకరమైన విషయం అనీ గ్రామస్థులు పేర్కొంటున్నారు. దయచేసి ఇట్టి ఆలయ నిర్మాణ పనులు వేగవంతం చేసి ఆలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. హనుమాన్ ఆలయ నిర్మాణం కొరకు గ్రామస్తులు జుక్కల్ ఎమ్మెల్యేకు నిధులు కావాలని అడగగా ఆయన ఏకకాలంలో ఆలయ అభివృద్ధి మేరకు 10 లక్షల రూపాయలను మంజూరు చేయించారు. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుళ్ళ గుడి పేరిట రాజకీయం చేయడం సబబు కాదని అలాంటి వారిని హనుమంతుడు తగిన శాస్త్రి ప్రకారం గుణపాఠం చెప్పక తప్పదని వారు పేర్కొన్నారు. హనుమాన్ ఆలయ అభివృద్ధి నిర్మాణం కొరకు తోచిన సహాయ సహకారాలు అందించినప్పటికీ ఎందుకు ఆలయ నిర్మాణం పూర్తి కావడం లేదని పలువురు స్థానికులు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా గ్రామ పెద్దలు వెంటనే స్పందించి గుడి పేరిట రాజకీయాలు చేయకుండా ఆలయ నిర్మాణం పూర్తి చేయాలనీ గ్రామ ప్రజలు కోరుతున్నారు.