10 May, 2026 | 1:57 PM

Breaking News

కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •  

ఎన్నికల సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

08-12-2025 12:00 AM

- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్, డిసెంబరు 7 (విజయక్రాంతి): జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింవు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.

అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వారీగా రాండమైజేషన్లో పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు.

ర్యాండమైజేషన్ లో పోలింగ్ అధికారులు(పీవో- ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ) 1255, ఇతర పోలింగ్ అధికారులు (ఓపివో )1773లను కేటాయించినట్లు తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టల్ బ్యాలెట్ల తరలింపు, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లను జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ కలెక్టర్‌కువివరించారు.