ఓబీసీలకు రాజకీయ అన్యాయమే!
పుల్లెంల గణేష్ :
భారతదేశం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వా మ్యం, గణతంత్రం, సామాజిక న్యాయం అనే పునాదుల మీద నిర్మించబడిన అద్భుతమైన గణతంత్ర రాజ్యం. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి కుల, మత, లింగ, వర్గ, ప్రాంత భేదం లేకుండా సమాన అవకాశాలు అందాలి. కానీ, స్వాతంత్య్ర గణతంత్ర భారతంలో 75 ఏళ్లు గడిచినప్పటికీ, దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబీసీ) చట్టసభల్లో సముచిత స్థానం దక్కకపోవడం నేటికీ ఒక తీరని లోటుగా మిగి లిపోయింది.
మన రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించింది. అయితే, 50 నుంచి 60 శాతం జనాభా కలిగిన ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో నామమాత్ర పు రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, రాజకీయాల్లో (చట్టసభల్లో) ఎలాంటి రిజర్వేషన్లు లేవు. దీనివల్ల ఓబీసీ కులాల నుంచి నామమాత్రపు నాయకులు మాత్రమే చట్టసభలకు వెళ్తున్నారు. ఓబీసీలు పొందాల్సిన వాటా ను అగ్రకుల పాలకవర్గాలు అనుభవిస్తున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
విధాన నిర్ణయాల్లో ఓబీసీల గొంతుక బలంగా వినిపించడం లేదు. ఎవరి జనా భా ఎంత ఉంటుందో.. వారికి అంత వాటా ఉండాలి అన్నది ప్రజాస్వామ్య సూత్రం. ఓబీసీలకు పార్లమెంటు, అసెంబ్లీలలో 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పిం చినప్పుడే నిజమైన ‘సమన్యాయం’ జరుగుతుంది. జనాభా గణన ప్రకారం ఏ కులం ఎంత ఉందో తేల్చి, ఆ మేరకు చట్టసభల్లో సీట్లు కేటాయించడం ద్వారా మాత్రమే అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందనేది వాస్తవం.
నాడు స్వాతంత్ర భారత అనంతరం భారత రాజ్యాంగం రాసే క్రమంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు అంబేద్కర్ వెంట ఉండబట్టి వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్స్ రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఓబీసీ కులాలు అంబేద్కర్ వెంట ఉండకుండా గాంధీ వెంట ఉండడం మూలంగా ఓబీసీ కులాలు రాజకీయ రిజర్వేషన్స్ కోల్పోయారు. అయినప్పటికీ ఒక కమిటీ వేసుకుని ఓబీసీల స్థితిగతులు అంచనా వేసి అవసరం మేరకు విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్స్ పొందుపరచుకోవచ్చని ఆర్టికల్ 340 ద్వారా పొం దుపరిచాడు.
నాడు ఓబీసీలకి రిజర్వేషన్స్ సాధించే క్రమంలో నాటి అగ్రవర్ణ కాంగ్రెస్ పాలకవర్గాలు అంబేద్కర్‌ను అడుగడుగు న అడ్డుకోవడం ద్వారా ఓబీసీలకి, మహిళలకి సామాజిక న్యాయం చేయలేకపో తున్నందుకు చింతిస్తూ తన న్యాయశాఖ మంత్రి పదవికి డా. బీఆర్ అంబేద్కర్ రాజీనామా చేయడం గమనార్హం.
50% పరిమితిపై పునరాలోచన
గతంలో సుప్రీంకోర్టు ఇంద్ర సాహ్నీ కేసులో రిజర్వేషన్లు 50% దాటకూడదని నిబంధన పెట్టింది. అయితే రాజ్యాంగం అనేది సజీవ పత్రం. సమాజ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదు. జనాభాలో 85%పైగా ఉన్న అణగారిన వర్గాలకు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ) కేవలం 50%లోపే రిజర్వేషన్లు ఉండటం సాంఘిక అసమానతకు దారితీస్తుంది. ఆధునిక పరిపాలనలో సామాజిక న్యాయం కోసం అవసరమైతే రాజ్యాంగ సవరణల ద్వారా ఈ పరిమితిని సడలించి, ఓబీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నేటి పాలకవర్గాలపై ఉంది. ఆ మేరకు చొరవ తీసుకున్నప్పుడే అణగారిన వర్గాలకు మేలు జరుగుతుంది.
ఉద్యమాల ఆవశ్యకత
గతంలో మాన్యశ్రీ కాన్షీరాం ఇతర ఓబీ సీ నాయకులైన మూలయంసింగ్ యాద వ్, లాలూ ప్రసాద్ యాదవ్‌లతో కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజకీయ ఎదుగుదల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారు. అదే బాటలో నేడు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో డా.విశారదన్ మహారాజ్ వంటి నాయకు లు ధర్మ సమాజ్ పార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ వేదిక ద్వారా బీసీ కులాలకు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్.
ఈశ్వరయ్య, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ మాజీ కలెక్టర్ టి.చిరంజీవులు, బీసీ రాజ్యాధికార సమితి నాయకులు బాలగోని బాలరాజు గౌడ్ గార్లతో సంయుక్తంగా కలిసి ఓబీసీల రాజకీయ వాటా కోసం, జనాభా దామాషా రిజర్వేషన్ల కోసం నీతి నిబద్ధతతో పోరాడుతున్నారు. రాజ్యాధికారం ద్వారానే సామా జిక మార్పు సాధ్యం అన్నది నేటి ఉద్యమకారుల నినాదం.
సంపూర్ణ ప్రజాస్వామ్యం అంటే ఏమిటి.?
దేశంలోని భూమి, వ్యాపారం, రాజ్యాధికారం అన్ని వనరుల్లో ప్రతి కులానికి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా దక్కినప్పుడు మాత్రమే భారత రాజ్యాంగ లక్ష్యం నెరవేరుతుంది. అగ్రకులాల చేతు ల్లో కేంద్రీకృతమైన అధికారాన్ని వికేంద్రీకరించి, బహుజనుల చేతుల్లోకి చేర్చడమే నేటి రాజకీయ తక్షణ కర్తవ్యం. అంతిమం గా ఓబీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం అంటే కేవలం కొన్ని సీట్లు ఇవ్వడం కాదు, అది శతాబ్దాల ఓబీసీల సామాజిక రాజకీయ ఆర్థిక సాం స్కృతిక అణచివేతకు పరిహారం, ప్రజాస్వామ్య బలోపేతం.
నేడు ఓబీసీల సమ స్యనే దేశంలో బలమైన సమస్యగా చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. నేడు దేశం లోని అగ్రకుల పాలకవర్గాలు సామాజిక న్యాయానికి కట్టుబడి ఓబీసీలకి వారి జనాభా తమషా ప్రకారం ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధంగా సమాన వాటాతో కూడిన రాజకీయ రిజర్వేషన్స్ సాధించడంలో తమ చిత్తశుద్ధిని చాటుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తులో ఆయా పాలకవర్గాలు ఓబీసీలకు జరుగుతున్న తరతరాల సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక అన్యాయానికి పాలకవర్గాలు తమ రాజకీయ ఉనికిని కోల్పోవడం తథ్యం.
ఓబీసీలకి 50% విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్స్ అమలైనట్లయితే కొన్ని లక్షల, కోట్ల ఓబీసీ కుటుంబాలు సామాజికంగా రాజకీయం గా ఆర్థికంగా సాంస్కృతికంగా అన్యాయానకి గురికాకుండా, ఆధునిక ప్రగతిని సాధి స్తారు అనే చారిత్రక సత్యాన్ని నేటి పాలకు లు గ్రహించాలి.
అందుకు తగిన విధంగా అవసరమైతే రాజ్యాంగ సవరణలు చేసి బలమైన చట్టాలు తీసుకొచ్చి ఓబీసీలకి రాజ్యాంగబద్ధంగా న్యాయం చేయాల్సిన చారిత్రక అత్యవసరత నేటి పాలకులపై ఉన్నది. అందుకు నేటి పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నతమైన, సమసమాజ గణతంత్ర రాజ్యంగా వర్ధిల్లుతుంది.
వ్యాసకర్త సెల్: 95530 41549




