12 May, 2026 | 7:41 PM

చొప్పదండిలో హీటెక్కిన రాజకీయం

17-09-2025 02:13 AM

మేడిపల్లి వర్సెస్ నుంకె

చొప్పదండి, సెప్టెంబరు 16 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బీ ఆర్‌ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ ల మధ్య, వారి అనుచరుల మ ధ్య నెలరోజులుగా కొనసాగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తుందని, ఎమ్మె ల్యే వేధింపుల వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యాయ త్నం చేసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆరోపించడం కలకలం రేపింది.

కరీంన గర్లో ఎలకల మందు తాగి హిమ్మత్ నగర్ కు చెందిన బండారి శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీనివాస్ ను చొ ప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పరామర్శించిన అనంతరం మేడిపల్లి సత్యం పై ఆరోపణలు చేయడంతోపాటు పోలీసు అధికారులపై ధ్వజమెత్తి అవసరమైతే హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించడం జరిగింది.

బ స్సు సౌకర్యం కల్పించాలని అడిగినందున ఎ మ్మెల్యే మేడిపల్లి సత్యం మరోవ్యక్తిని పురమాయించి కేసు పెట్టించి పోలీసులతో కొ ట్టించడంతో మనస్థాపంతో శ్రీనివాస్ ఎలక ల మందు తాగినట్లు సుంకె రవిశంకర్ విమర్శించడాన్ని మేడిపల్లి సత్యం అనుచరులు తీవ్ర స్థాయిలో ఖండించారు. ఎమ్మెల్యే చే స్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే నీచ రాజకీయాలకు తెరలేపుకున్నాడం టూ సుంకెపై నుండిపడుతున్నారు.

తొలుత నారాయణపూర్ రిజర్వాయర్ వ్యవహారం లో, ఆ తర్వాత కేసీఆర్ పై మేడిపల్లి చేసిన వి మర్శలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలై శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం సంఘటనలో తారాస్థాయికి చే రింది. స్థానిక పోరుకు ముందే ఈ నేతల మ ధ్య రాజకీయ పోరు నెలకొనడంతో నియోజకవర్గంలో రాజకీయం నెల రోజులుగా హీ టెక్కుతూ నేడు తారాస్థాయికి చేరింది.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు మద్దతుగా చొప్పదండి నియోజకవర్గంలోని చొప్పదండి, గం గాధర, రామడుగు, బోయినిపల్లి, మల్యాల, కొడిమ్యాల నాయకులు ఒక్కతాటిపై ఉండి నుంకె ఆరోపణలను తిప్పికొడుతుండగా, బీ ఆర్‌ఎస్ లో మాత్రం ఐక్యత లోపించింది.

బీ ఆర్‌ఎస్ పార్టీ నుండి సీనియర్ నేతలు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితుల్లో సుంకె రవిశంకర్ కు అండగా నిలబడి మేడిపల్లి ఆరోపణలను ఖండిస్తున్నవారు లేకుం డా పోయారు. ఒకరిద్దరు నాయకులు సుంకె వెంట ఉంటున్నారు తప్ప ఎవరు ముందుకు రావడం లేదు. సుంకె ఒక్కడే ఎప్పటికప్పుడు మేడిపల్లికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు.