calender_icon.png 18 September, 2025 | 1:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్

17-09-2025 02:12:28 AM

  1. పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగులు
  2. నాన్ క్యాడర్ అధికారులకు బదిలీలు
  3. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రప్రభుత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులు, నాన్ క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్త ర్వులు జారీచేశారు. మెట్రో ఎండీగా కొనసాగుతున్న ఎన్‌వీఎస్ రెడ్డిని రిలీవ్ చేస్తూ.. ఆ అదనపు (ఎఫ్‌ఏసీ) బాధ్యతలను హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అప్ప గించారు.

అలాగే సెలవుపై ఉన్న శృతి ఓజా తిరిగి విధుల్లో చేరడంతో ఆమెకు మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు డైరెక్టర్‌గా నియమించారు. ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్యకు తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూట్ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ ఎస్) సెక్రెటరీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు.

హెచ్‌ఎండీఏ జా యింట్ కమిషనర్ కోట శ్రీవత్సకు జాయిం ట్ మెట్రో పాలిటన్ కమిషనర్ (జనరల్) బాధ్యతలతో పాటు హెచ్‌ఎండీఏ సెక్రెటరీగా ఉన్న ఉపేందర్‌రెడ్డిని బదిలీ చేస్తూ.. కోట శ్రీవత్సకు పూర్తి అదనపు బాధ్య తలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. దీంతోపాటు పలువురు నాన్ క్యాడర్ అధికారులను కూడా బదిలీ చేశారు. సివిల్ సప్లయ్ జీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం రాజిరెడ్డిని అక్కడి నుంచి బదిలీ చేస్తూ.. హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారిగా నియమించారు.

ఆదిలాబాద్ జడ్పీ సీఈవోగా ఉన్న జితేందర్‌రెడ్డిని టీజీ ఆయిల్‌ఫెడ్ ఎండీగా నియమించారు. ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్ ఎండీగా ఉన్న జే శంకరయ్యను అక్కడి నుంచి బదిలీచేసి, పోస్టింగ్ ఇవ్వలేదు. స్పెషల్‌గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ ఆర్ ఉపేందర్‌రెడ్డిని హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (సబ్ అర్బన్ రీజియన్)గా నియమించారు. అలాగే స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ టీ వెంకన్నను హెచ్‌ఎండీఏలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్ అండ్ మెట్రో రైల్)గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.