21-01-2026 06:56:10 PM
ఉప్పల్,విజయక్రాంతి: కార్పొరేషన్ ఎన్నికలు నోటిఫికేషన్ రాకముందే నాచారం డివిజన్లోని పెద్ద చెరువు దోమలు గుర్రపు డెక్క దోమల నిర్మూలన అనే దానిపై రాజకీయం వేడెక్కుతుంది. నాచారంలో రాజకీయ పార్టీ నాయకులమధ్య దోమల రాజకీయం వేడెక్కింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా దోమల పేరుతో ధర్నాలు కూడా నిర్వహిస్తూ ఉండడంతో స్థానికంగా చర్చనీయమైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కార్పొరేట్ ఎ నాచారం పోలీస్ స్టేషన్ వద్ద నాలా దోమల నిర్మూలన అంశంపై ఎజెండాగా చేసుకొని కార్పొరేటర్ శాంతి మొదటిసారి కాంగ్రెస్ నుండి గెలిచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు.
రెండుసార్లు గెలుపొందిన అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద నాలా మరియు దోమ నిర్మూలనకై చర్యలను చేపట్టారు ఇటీవల కాలంలో గుర్రపు డెక్క పెరిగి దోమలు వృద్ధి చెందడంతో రాజకీయ నాయకులు రాజకీయ మొదలుపెట్టారు. అధికారంలో ఉన్న కార్పొరేటర్ దోమల నిర్మూలకై నిత్యం అధికారులను సంప్రదిస్తూ గుర్రపు డెక్క తొలగించాలని కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదుల పర్వం జరుగుతుంటే మరోపక్క ఇతర పార్టీ రాజకీయ నాయకులు దోమల నిర్మూలన లేదు కేవలం పత్రిక ప్రటన కోసమే ఉన్న కార్పొరేటర్ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. గెలిపొందిన కార్పోరేట్ అభివృద్ధి శూన్యం అంటూ ధర్నాలు నిర్వహిస్తున్నారు.
ప్రధాన సమస్య దోమలు హెచ్ఎంటి నగర్ లోని పెద్ద చెరువు ఉండడంవల్ల గుర్రపు డెక్క తో దోమలు వృతి చెందడం దీంతో నాచారంలోని దోమల సమస్య ప్రధానంగా మారింది. గత ఎన్నికల్లో దోమల నిర్మూలన చేస్తామంటూ కార్పొరేటర్ హామీ ఇచ్చి కొంతవరకు నెరవేర్చినప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం దోమల నివారణ చేయబట్టలేకపోయారు అనేది పలువురి ఆరోపణ. ప్రభుత్వ మారడంతో గుర్రపు డెక్క తొలగించకుండా కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్నారని కార్పొరేట్ అంటున్నారు.
అటు కాంట్రాక్టర్ అధికారులు నిర్లక్ష్య ధోరణి మరి ఏదో తెలియదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం దోమల సమస్య ఎన్నికల ఎజెండగా మారింది పలువురు ప్రజలు అభిప్రాయం బెత్త పరుస్తున్నారు దీంతో కార్పొరేట్ ఎన్నికల రాగానే రాజకీయ నాయకులు దోమలను వృద్ధి ఓట్లుగా మలుచుకొని ప్రజల మద్దతు కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీ పడుతున్న రాజకీయ నాయకులకు ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో వేచి చూడాల్సిందే మరి