calender_icon.png 21 January, 2026 | 8:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గర్రెపల్లి ప్రభుత్వ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల ఆహ్వానం

21-01-2026 07:07:27 PM

 ప్రిన్సిపాల్ డా.గోల్డి బాల్బీర్ కౌర్

సుల్తానాబాద్,(విజయక్రాంతి):  తెలంగాణ మోడల్ స్కూల్ గర్రెపల్లిలో ఆరవ తరగతి పదవ తరగతి ప్రవేశ పరీక్ష ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్  డా.గోల్డి బాల్బీర్ కౌర్  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19 న 6వ తరగతి వారికి ఉదయం 10:00 నుంచి 12 గంటల వరకు 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అదే రోజున మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆరవ  తరగతి ప్రవేశానికి ప్రస్తుతం ఐదవ తరగతి చదువుతూ ఉండాలని 7 నుంచి 10 తరగతి వరకు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేస్తామన్నారు. మా ప్రత్యేకతలుఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డుల సహాయంతో విద్యాబోధన. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, అధ్యాపక బృందం. 

కంప్యూటర్ ల్యాబ్. సైన్స్ ల్యాబ్ మాథ్స్ ల్యాబ్. గ్రంథాలయం. విశాలమైన క్రీడా స్థలం. ఉచిత నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్. పూర్తి ఆంగ్ల మధ్యమంలో ఉత్తమ భోదన -ఉత్తమ ఫలితాలు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమలలో విద్యార్థులను తీర్చిదిద్దుట.వృత్తివిద్య కోర్సు లు బ్యూటీ అండ్ వెల్నెస్ , ఐ టి , ఐ.టీ.ఇ.ఎస్ తో పాటు ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకై ఓపెన్ కేటగిరి విద్యార్థులకు 200 రూపాయలు. బీసీ, ఎస్సీ ,ఎస్టీ, పీహెచ్సీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 125 రూపాయలను చెల్లించి telanganams.cgg.gov. in అనే వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరు అని కోరారు...