calender_icon.png 7 December, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యనగరంలో ‘ఆపరేషన్ కవ’

07-12-2025 12:00:00 AM

-5 వేల మంది పోలీసులతో తనిఖీలు

-ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో జల్లెడ 

-రంగంలోకి లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ట్రాఫిక్ సిబ్బంది

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు ఆపరేషన్ కవ పేరుతో అత్యంత భారీ స్థాయిలో స్పెషల్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. శుక్రవారం రాత్రి నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీ నిర్వహిం చారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది ఏకకాలంలో రోడ్లపైకి వచ్చారు. నగరంలోని 150 కీలక ప్రాం తాలను ఎంపిక చేసి అక్కడ ముమ్మర తనిఖీలు చేపట్టారు.

ఈ డ్రైవ్‌లో లా అండ్ ఆర్డ ర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృం దాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. అనుమానిత వాహనాలు, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రజా భద్రత కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. నగర పౌరులందరూ తనిఖీల సమయంలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.