భద్రాచలంలో పొంగులేటి జన్మదిన వేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్, రక్తదానం శిబిరం, అన్నదానం, బైక్ ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రత్నం రమాకాంత్ ఆధ్వర్యంలో మండల నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో యువత పాల్గొనగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులు ఎండి జిందా, ఎండి నవాబ్ అధ్వర్యంలో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జెండా ఊపి ప్రారంభించారు.
టిపిసిసి ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు, టిపిసిసి మెంబర్ బుడగం శ్రీనివాస్ యువతతో పాటు బైక్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గిరిజన అభ్యుదయ హాల్ నందు రక్తదాన శిబిరాన్ని ఎండి జిందా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా వారి సోదరుడు ఎండి నవాబ్ రక్తదానం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువత కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా హాస్పటల్ నందు వివిధ ప్రాంతాల నుంచి చికిత్స నిమిత్తం వచ్చిన పేషెంట్స్ కు వారి కుటుంబ సభ్యులకు, స్థానికులు భారీ సంఖ్యలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళలు, భారీ సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.






