15 April, 2026 | 8:01 AM

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

28-10-2025 10:16 PM

ఆసక్తి గల యువకులు పట్టణ ప్రజలు రక్తదాన శిబిరంలో పాల్గొనవచ్చు

మొత్తం రాఘవులు ఫంక్షన్ హాల్లో పోలీస్ అమరవీరుల దినోత్సవం, ఎస్సై బొజ్జ మహేష్

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు అసువులు బాసిన పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో ఉదయం 9:30 గంటల నుండి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. రక్తదాన శిబిరంలో ఆసక్తి కలిగిన యువతి యువకులు పట్టణ ప్రజలు మహిళా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ప్రజలు పలువురు రక్తదాన శిబిరంలో పాల్గొనాలని తెలిపారు. రక్తదాన శిబిరం ద్వారా అవసరమైన వారికి ప్రజలకు ఎవరికైనా ప్రాణదానం చేయగల స్ఫూర్తిని కలిగించిన వారి మతాన్ని దాని ముఖ్య ఉద్దేశమని ఎస్ఐ మహేష్ తెలిపారు. రక్తదాన శిబిరంలో పాల్గొన దలచిన వారు తమ పేర్లను 871266233 నంబర్ కి సంప్రదించగలరని ఎస్సై తెలిపారు.