calender_icon.png 28 October, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు

28-10-2025 07:13:36 PM

సీతంపేట శివాలయంలో ప్రత్యేక పూజలు..

60 కేజీల భారీ కేక్ కట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు..

పినపాక (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మంగళవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. క్రాస్ రోడ్డు నుంచి సీతంపేట శివాలయానికి భారీ బైక్ ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్బంగా 60 కేజీల భారీ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రధాత పొంగులేటి శ్రీను అన్న నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంటుందని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు.

కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఉడుముల రవీందర్ రెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, కొర్స బాలకృష్ణ,  శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్, యూత్ కాంగ్రెస్ పెనుపాక మండల అధ్యక్షులు సింహాద్రి మనోజ్ మాజీ సర్పంచులు తోలెం కళ్యాణి, కొర్సా కృష్ణంరాజు,  వాగబోయిన చందర్ రావు, వంకా నర్సింహారావు, నాయకులు పొనుగోటి చందర్ రావు, సాగి సురేష్,  కొమరం రాములు, సుంకర వెంకటరమణ, కస్తూరి లింగయ్య, మద్దెల సమ్మయ్య, బోడ రమేష్, సాగర్ రెడ్డి, ఆరె నవీన్, కోడెం రామ్ మోహన్, మధు, మల్లయ్య, హేమంత్, సాగి సురేష్, కొప్పుల వీరాస్వామి, సతీష్ చారీ, తాల్లూరి కాంతయ్య, వీరబాబు, కే బుచ్చి బాబు, మునిగల శేఖర్, గుట్టయ్య, తాటి సుజాత, విజయ, జంపయ్య, కళ్యాణం నాగేశ్వరరావు, గంజాయి చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.