19-01-2026 06:40:18 PM
ఎమ్మెల్యే విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన చంద్రయ్య గౌడ్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్లా శ్రీ రంగనాయక స్వామి దేవాలయం వద్ద జరుగు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర చైర్మన్ గా నీరుకుల్లా గ్రామానికి చెందిన పొన్నం చంద్రయ్య గౌడ్ నియామకమైనట్లు సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు నియామక పత్రాన్ని అందజేశారు. జాతర కమిటీ సభ్యులుగా నేరెళ్ల రాజయ్య, అడ్డగుంట శ్రీనివాస్, కోమల ప్రశాంత్, సిరిసిల్ల కళావతి లు నియామకమయ్యారు.
ఈ సందర్భంగా చైర్మన్ గా నియామకమైన పోన్నం చంద్రయ్య గౌడ్, సభ్యులు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు కృతజ్ఞతలు తెలిపారు.... ఈనెల 28, 29, 30 తేదీలలో మూడు రోజులపాటు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర వేడుకలు వైభవంగా జరుగుతాయి, జాతరలో పాల్గొనే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చైర్మన్ పోన్నం చంద్రయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు తెలిపారు...