19-01-2026 06:42:49 PM
మోతె,(విజయక్రాంతి): మోతే గ్రామానికి ఇంచార్జ్ పంచాయతీ కార్యదర్శి కాకుండా పర్మినెంట్ పంచాయతీ కార్యదర్శి కావాలని సోమవారం ఎంపీడీఓ టి. ఆంజనేయులుకు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మండల నాయకులు బొడ్డు సాలయ్య, సీపీఎం మోతె గ్రామ కార్యదర్శి దోసపాటి శ్రీనివాస్ లు వినతిపత్రం అందించారు.
అనంతరం విలేకరుల తో మాట్లాడుతూ గడిసిన సంవత్సర కాలం నుంచి ఇంచార్జి కార్యదర్శి తో అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంటి పన్ను ఇవ్వడానికి సమయానికి రాకుండా గంటల సమయం వేచి ఉండవలసిన పరిస్థితి ఉండేదని ఇంచార్జి కార్యదర్శి కాకుండా పర్మినెంట్ కార్యదర్శి ని మండల కేంద్రానికి ఏర్పాటు చేయాలని కోరారు.