10 July, 2026 | 3:07 AM

మచ్చలేని నేత పొన్నం ప్రభాకర్

11-06-2024 12:05 AM

కాంగ్రెస్ నేత వెలిచాల 

కరీంనగర్, జూన్ 10 (విజయక్రాంతి): మచ్చలేని నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ అని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ జీవితంలో పొన్నం ఎన్నో పదవులు అలంకరించారని, ఆయనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. ఇటీవల ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు. తనిఖీలు, నిఘా సంగతి అధికారులు చూసుకుంటా రని, నిబంధనలు మీరితే వాహన యజమానులపై జరిమానా విధిస్తారన్నారు. అంతేగానీ బాధ్యత గల ఎమ్మెల్యే స్థానంలో ఉండీ వీధి రౌడీలా వ్యవహరించడంపై మండిపడ్డారు.