సిమెంట్ ఫ్యాక్టరీలో హైడ్రామా
హక్కుల సాధన కోసం పైలో టవర్ ఎక్కిన కార్మికులు
పెద్దపల్లి (మంథని), జూన్ 10 (విజయక్రాంతి): పెద్దల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని ఓ ప్రైవేటు సిమెంట్ ఫ్యాక్టరీలో సోమవారం హైడ్రామా నడిచింది. ఫ్యాక్టరీలో పని చేస్తున్న 18 మంది కాంట్రాక్ట్ కార్మికులు హక్కుల సాధన కోసం ఫ్యాక్టరీలోని టవర్ ఎక్కారు. యాజమాన్యం ఇటీవల సినియారిటీ ప్రకారం ప్రకటించిన బేసిక్ పర్మినెంట్ జాబితాల్లో తమకు అన్యాయం జరిగిం దని వారు నిరసన తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు కిందికి దిగి రాలేమని స్పష్టం చేశారు. దీంతో తోటి కార్మికులు వెంటనే పోలీసులు, యాజమాన్యానికి సమాచారమిచ్చారు.
బసంత్ నగర్ ఎస్సై స్వామి, ప్లాంట్ హెడ్ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఆర్‌హెడీ పార్థసారథి, కార్మిక సంఘాల నాయకు లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైలో టవర్ ఎక్కిన కార్మికు లతో ఫోన్‌లో మాట్లాడి వారిని శాంతింపజేశారు. నిబంధనల ప్రకా రం కార్మికులకు న్యాయం చేస్తామని ప్లాంట్ హెడ్ శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇవ్వడంతో కార్మికులు కిందికి దిగి వచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.






