calender_icon.png 27 October, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఐ సౌత్ రీజియన్ కార్యదర్శిగా పొన్నం రవిచంద్ర

15-07-2024 01:34:37 AM

కరీంనగర్, జూలై 14 (విజయక్రాంతి): ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీ (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ఐ) సౌత్ రీజియన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ పొన్నం రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగళూరులోని సుచిత్ర ఫిలిం సొసైటీలో ఆదివారం జరిగిన సొసైటీ సభలో సభ్యులు ఆయన్ను ఎంపిక చేశారు.  సొసైటీ కార్యదర్శి బీఎస్‌ఎస్ ప్రకాశ్ రెడ్డి ఈ మేరకు రవిచంద్రకు నియామక పత్రం అందజే శారు. ఈ సందర్భంగా రవిచంద్రకు కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి లక్ష్మీగౌతమ్‌తో, సొసైటీ సభ్యులు రమేశ్‌బాబు, రామ్మోహన రాయు డు, రవీంద్ర తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.