గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు
సుల్తానాబాద్, మే 10 (విజయక్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దుబ్బపల్లి గ్రామంలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించబోయే గ్రామ పంచాయతీ భవనానికి స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఆదివారం శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు సంవృద్ధిగా అందుతున్నాయని ప్రతీ గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు అహర్నిశలు పని చేస్తున్నామని అన్నారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వాటన్నిటికీ ప్రజలందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో దుబ్బపల్లి గ్రామ సర్పంచి శోభ, గ్రామ పంచాయతీ పాలకవర్గం, సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు , డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






