చిన్నారుల ఆరోగ్యం కోసం పౌష్టికాహారం ముఖ్యం
మున్సిపల్ కార్పొరేటర్లు
పాల్వంచ,(విజయక్రాంతి): చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికారం ఎంతో ముఖ్యమని, అంగన్వాడీ కేంద్రాల్లో ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 36, 38, 45వ డివిజన్లో కార్పొరేటర్లు పైడిపల్లి జయలక్ష్మి, బత్తుల మధుచందు, దంత బోయిన నరేష్లు అన్నారు.
సోమవారం పాల్వంచ పట్టణ పరిధిలోని టీచర్స్ కాలనీ, గట్టాయిగూడెం, ఒడ్డుగూడెం, సబ్ స్టేషన్, మార్కెట్ ఏరియాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఘనంగా పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రసన కార్యక్రమాల నిర్వహించారు. అంగన్వాడి సూపర్వైజర్ నండ్రు దీప మాట్లాడుతూ... ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.






