మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం
ప్రశ్నించిన కుటుంబాలపై సామాజిక బహిష్కరణ – నెలవారీ చందా వివాదం
అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు
మధిర,(విజయక్రాంతి): మధిర మండలంలో కుల బహిష్కరణ కలకలం రేపింది. ఈ విషయం పై ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం లో బాధితులు అదనపు కలెక్టర్ శ్రీజకు వినతి పత్రం అందజేశారు. మధిర మండలం ఆత్మకూరు గ్రామంలో గత సంవత్సరం కాలంగా కుల బహిష్కరణ పేరుతో సాటి కులస్తులను అవమానిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆత్కూరు గ్రామానికి చెందిన పెరుమాళ్ళపల్లి మోహన్ రావు కొత్తపల్లి భాను ప్రసాద్, మేడికొండ రాజరత్నం, వినయ్ కుమార్, కిషోర్, క్రాంతి కుమార్, తిరుమల పల్లి విజయరాజు అన్నారు.
కులం కట్టుబాటులు మర్యాదలు నవ్వులు పాలు చేయకూడదని కారణంతో ఇప్పటివరకు అవకాశం ఇచ్చామని, అయినప్పటికీ వారి ఆగడాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. కేవలం వారి పెత్తనం సాగట్లేదు అనే నెపంతో నెలవారి చందా రూ.50 వసూలు చేస్తూ ..వసూలు చేసిన చందాను వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని ప్రశ్నించి, మేము 50 రూపాయలు ఇవ్వముఅన్నందుకు, గ్రామంలోని కొందరు పెద్దమనుషులుగా చలామణి అవుతూ ప్రశ్నించిన కుటుంబాల వారిని, కుల బహిష్కరణ చేశామని అందరికీ చెప్పి, వారి ఇంటికి ఎవరు పోవద్దు, వాళ్లతో మాట్లాడిన, వాళ్ళ ఇంటిలో శుభకార్యాలు జరిగింది.
ఎవరైనా మరణించిన, వాళ్ళ ఇంటికి, లేదా అంత్యక్రియలో పాల్గొన్న, పాల్గొన్నవారు రూ.20 వేల రూపాయిలు తప్పు చెల్లించవలసి వస్తుందని, ఏమీ తెలియని అమాయకులకు బెదిరిస్తూ, అలా వెలివేసిన మా కుటుంబాల కు ఎవరిని రానీకుండా కట్టడి చేస్తూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ఇతర కులాల వారికి ఫలానా వాళ్ళను కుల బహిష్కరణ చేసినాము అంటూ... అందరికీ చెప్పి, మమ్మల్ని మానసికంగా ఎంతో శోభకుకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ .20 వేలు తప్పు చెల్లించి మళ్లీ కులములో కలవాల్సి ఉంటుంది.
కాబట్టి ఎవరూ వెళ్లకుండా, నియంత్రణ చేస్తూ బంధువులను, విడదీస్తూ, కుల బహిష్కరణ పేరుతో మమల్ని మానసికంగా దాదాపు సంవత్సర కాలం నుంచి వేధిస్తున్నారు. కావున ఈ విషయాన్ని గమనించి సంబంధిత అధికారులు వారి పైన చట్టరీత్యా చర్య తీసుకుని, భారత రాజ్యాంగంలో అందరూ సమానమే అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేసి మాకు న్యాయం చేసి మమ్మల్ని తోటి గ్రామస్తులను ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని కోరారు.






