20-01-2026 02:01:39 AM
సిద్దిపేట, జనవరి 19 (విజయక్రాంతి): ఉద్యోగమైన, రాజకీయ పదవి అయిన దై వంతో భావిస్తేనే దానికి సంపూర్ణమైన న్యా యం చేయగలుగుతామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సర్పంచు లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రా రంభించి మాట్లాడారు. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మీకు దక్కిన పదవికి న్యాయం చేయాలని చెప్పారు.
సర్పంచుల విధులు, బాధ్యతలు, నిధులు, ఆ దాయం, ఖర్చు వంటి అంశాలను శిక్షణలో నేర్చుకుంటారని, ఏది చేసిన వార్డు సభ్యులను కలుపుకొని చట్టం పరిధిలో చేయాలని ఆదేశించారు. శిక్షణ తరగతులలో ఏర్పాటుచేసిన వివిధ శాఖల స్టాల్స్ ను పరిశీలించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, డిఆర్డిఏ పిడి జయదేవ్ ఆర్య, వివిధ శాఖల అధికారులు, మాస్టర్ ట్రైనర్స్, సర్పంచులు పాల్గొన్నారు.