calender_icon.png 20 January, 2026 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ లో లాంగిట్యూడ్ 77 ఆవిష్కరణ

20-01-2026 01:58:06 AM

హైదరాబాద్ , జనవరి 19: పెర్నాడ్ రికార్డ్ ఇండియాకు చెందిన భారతీయ సింగిల్ మాల్ట్ లాంగిట్యూడ్ 77 బ్రాండ్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. చారిత్రక నేపథ్య కట్టడం తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ వేదికగా దీనిని ఆవిష్కరించారు. అసాధారణమైన నాణ్యతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన లాంగిట్యూడ్ 77 లండన్ స్పిరిట్స్ కాంపిటీషన్లో గోల్డ్, ది స్పిరిట్స్ బిజినెస్ చేత గ్లోబల్ స్పిరిట్ మాస్టర్స్ గా ప్రశంసలు అందుకుంది. ఈ అవార్డులు లాంగిట్యూడ్ 77 బ్రాండ్ యొక్క నాణ్యతకు, స్థాయిని ప్రతిబింబిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

రెండు శతాబ్దాలకు పైగా విస్కీ తయారీలో టాప్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న లాంగిట్యూడ్ 77 ను హైదరాబాద్ లో ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని ప్రఖ్యాత విస్కీ నిపుణుడు జిమ్ ముర్రే చెప్పారు, ప్రీమియం విస్కీ వినియోగానికి బలమైన సామర్థ్యం ఉన్న మార్కెట్లపై దృష్టి సారించి, భారతదేశం అంతటా లాంగిట్యూడ్ 77ను తీసుకొస్తున్నట్టు తెలిపారు.  ప్రస్తుతం మహారాష్ట్ర, గోవా, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజా బ్, కర్ణాటక, దుబాయ్ , ఢిల్లీ , ముంబైలో అందుబాటులో ఉంది.