calender_icon.png 11 January, 2026 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడ్డ వారికే పదవులు

10-01-2026 12:00:00 AM

సదాశివపేట ఏఎంసీ ప్రమాణ స్వీకారోత్సవం నిర్మల జగ్గారెడ్డి

సదాశివపేట, జనవరి 9 : పార్టీని నమ్ముకొని కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. శుక్రవారం సదాశివపేట వ్యవసార మార్కెట్ కమిటీ చైర్మన్గా అలివేణి నర్సింహ్మరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. రైతులకు సరైన గిట్ట బాటు ధర కల్పించడానికి మార్కెట్ కమిటీ బాధ్యత వహించాలన్నారు.

మార్కెట్ కమిటీలో రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్త లు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  సంగారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి   ఆంజనేయులు, సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి,  ఆత్మ కమిటీ చైర్మెన్ ప్రభు,  సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చందర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు మునిపల్లి సత్యనారాయణ, సిద్దన్న తదితరులు పాల్గొన్నారు.