3 April, 2026 | 10:03 PM

సీపీగా ఎస్.రష్మీ పెరుమాళ్ బాధ్యతల స్వీకరణ

10-01-2026 12:00 AM

సిద్దిపేట క్రైం, జనవరి 9 : సిద్దిపేట నూతన పో లీస్ కమిషనర్‌గా ఎస్. రష్మీ పెరుమాళ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ సీహెచ్ కుశా ల్కర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, గజ్వేల్ ఏసీపీ నరసింహులు, హు స్నాబాద్ ఏసీపీ సదానందం, ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాద పూర్వకంగా  కలసి మొక్కలను అందజేశారు.

అంతకుముందు పోలీసుల గౌర వ వందనం సమర్పించారు. అనంతరం కమిషనర్ కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలను రష్మీ పెరుమాళ్ సందర్శించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబా టులో ఉండి మరింత మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ సూచించారు.