21-07-2025 01:16:08 AM
మహబూబ్ నగర్ రూరల్ జూలై 20 : నూతన విధానాలకు స్వాగతం పలికేందుకు గాను తపన శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుందని మహబూబ్ నగర్ జిల్లా పో స్టల్ సూపరింటెండెంట్ విజయ జ్యోతిఅన్నా రు.
ఈ క్రమంలోనే ఈ నెల 19వ తేదీతో పా టు సోమవారం కూడా తపాల శాఖ లో సే వలు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. తపాలా శాఖ కార్యాలయాల ద్వారా, సేవలన్నింటిని ఒకే గొడుగు క్రిందకు తెచ్చి అమలు చేయుటకు నిర్ణయించిన నేపథ్యం తో ఐ.టీ 2.0 పేరుతో నూతన సాఫ్ట్వేర్ రూ పొందించారనితెలిపారు. ఈ సాఫ్ట్వేర్, కార్యకలాపాల డేటా భద్రతను పెంచుతుంద న్నారు.
ఉద్యోగుల పని సామర్థ్యం కూడా పెరగడమే కాక, సేవలు మెరుగవుతాయని పేర్కొన్నారు.తెలంగాణ సర్కిల్ అంతట ఐ.టీ 2.0 ను ఈనెల 22వ తేదీ నుంచి తపాలా శాఖ, తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందని వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని తెలిపారు.