calender_icon.png 22 July, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

21-07-2025 01:15:05 AM

కోయిల్ కొండ జూలై 20 : మండల మండల కేంద్రంలో విద్యుత్ ఘాతానికి ఒక ఎద్దు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ ఏఈ సత్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన రైతు చాకలి కృష్ణయ్య చెందిన ఎద్దు పశు గ్రాసం వేయడానికి వెళ్ళింది. అప్పటికే లైన్ వైరు తెగిపోవడంతో ఎద్దు అక్కడికి చేరుకొని పశు గ్రాసం మేస్తుండగా విద్యుత్తు ఘాతానికి గురై మృతి చెందింది.

ఎద్దు రూ 60 వేలవిలువ ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై విద్యుత్ లైన్ మెన్, వెటర్నరీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించారు. విద్యుత్ అధికారులు తగిన నష్ట పరిహారం అందించి రైతును ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఏఈ తెలిపారు.