12-11-2025 08:37:06 PM
యజమానిపై కేసు నమోదు..
సిద్దిపేట క్రైం: అనుమతి లేకుండా మద్యం అమ్ముతున్న సిద్దిపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న మహాలక్ష్మి టీ స్టాల్ ను బుధవారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను టూటౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ వెల్లడించారు. ఈ నెల 2న సాయంత్రం మహాలక్ష్మి టీ స్టాల్ లో తనిఖీ చేయగా మద్యం లభించిందని చెప్పారు. మద్యాన్ని సీజ్ చేసి టీ స్టాల్ యజమాని బర్మా బాలకట్టమల్లు పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. టీ స్టాల్ పై చర్య తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ లేఖ పంపించినట్టు చెప్పారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో వెళ్లి టీ స్టాల్ ను సీజ్ చేశారు.