4 March, 2026 | 7:36 PM

ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు

04-03-2026 05:52 PM

నిర్మల్,(విజయక్రాంతి): భద్రాచలం రాముని ఆలయంలో ఈ నెల 27న శ్రీ రామ నవమి  సీతారాముల కల్యాణ మహోత్సావ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇంటివద్దకే అందచేసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. బుధవారం స్థానిక బస్ డిపోలో పోస్టర్లను ఆవిష్కరించారు. నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూ.151తో లాజిస్టిక్ ద్వారా ఈ నెల 31 లోపల బుక్ చేసుకుంటే శ్రీ సీతారాముల కళ్యాణం అనంతరం మీ ఇంటి వద్దకే శ్రీ సీతారాముల వారి తలంబ్రాలు అందచేయడం జరుగుతుందని అన్నారు. భద్రాచలం వెళ్లలేని భక్తులు బస్టాండ్ లో గల ప్రత్యేక కౌంటర్ లో ముందస్తుగా తలంబ్రాల  కొరకు  151/- చెల్లించి బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు