calender_icon.png 6 December, 2024 | 4:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డి ఎస్ సి కౌన్సెలింగ్ వాయిదా

15-10-2024 11:09:44 AM

కరీంనగర్, (విజయక్రాంతి): డి ఎస్ సి కౌన్సెలింగ్ వాయిదా పడింది. మంగళవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ లోని విష్యశాఖ కార్యాలయంకు వచ్చి కౌన్సెలింగ్ లో పాల్గొనాలని డి ఎస్ సి కి ఎంపిక కాబడి నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ మెసేజ్ పంపింది. పోస్టింగ్ ఉత్తర్వుల అందుకోవడానికి డి ఈ ఓ కార్యాలయంకు వచ్చిన కరీంనగర్ జిల్లా నుండి ఎంపిక అయిన 214 మందికి నిరాశ ఎదురైనది. విద్యాశాఖ నుండి కౌన్సెలింగ్ ఆపాలని ఉదయం 8.30 గంటలకు డి ఈ ఓ కు సమాచారం రావడంతో కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో డి ఎస్ సి కి ఎంపిక అయిన వారు కలెక్టరేట్ ఎదుట 10 గంటల వరకు వేచి చూసి నిరాశతో వెనుతిరిగారు. పోస్ట్ కేసులు, 372 జి ఓ కు సంబంధించి బదిలీల ప్రక్రియ పెండింగ్ లో ఉండటంతో ప్రభుత్వం కౌన్సిలింగ్ వాయిగా వేసినట్టు తెలిసింది.