calender_icon.png 7 August, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టులు పెంచాలి.. 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలి

25-07-2025 01:33:36 AM

ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం, జులై 24, (విజయ క్రాంతి)ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) పరీక్ష నోటిఫికేషన్ కు సంబంధించి కచ్చితంగా పోస్టులు పెంచాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పా ల్వంచ లోని సిఆర్ భవన్ లో సారిక అధ్యతన జరిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి సెకండ్ ఏఎన్‌ఎం ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పోస్టులను పెంచడంతో పాటు, పరీక్షకు అర్హతలేని వారికి రూ10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ తోపాటు , 100% గ్రాస్ శాలరీ ఇ వ్వాలన్నారు. రెండవ ఏఎన్‌ఎం లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె చేసిన సమయములో ఇ చ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. 18 సంవత్సరాలుగా వీరితో పని చేయించుకున్న ప్రభుత్వాలు చివరకు రిటైర్మెంట్ సమయంలో వట్టి చేతులతో ఇంటికి పంపించడం ఏమాత్రం సమంజసం కాదన్నారు.

నూతన ఆర్థిక విధానాలతో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వంటి పేర్లతో ఉద్యోగాలను సృష్టి అరకోరా జీతాలు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఓపి ఏఎన్‌ఎం ను శాంక్షన్ చేయడం, యూపీఎస్సీలలో ప్రతి సబ్ - సెంటర్ లో కాంట్రాక్ట్ ఏఎన్ ఎం తో పాటు రెగ్యులర్ ఏఎన్‌ఎం ను నియమించడం ద్వారా మొత్తం 2,000 పోస్టులు పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు బండి నాగేశ్వరరా వు, వేల్పుల మల్లికార్జున్, ఇట్టి వెంకట్రావు, అన్నారకు వెంకటేశ్వరరావు, రెండవ ఏఎన్‌ఎం ల సంగం నాయకురాలు బానోతు ప్రియాంక, ఎట్టి సుమలత, కొమరం బాలనాగమ్మ, భూక్య జ్యో తి , వంకా పుష్ప ,పూసం సారిక. తుర్రం సమ్మక్క,స్వరాజ్య లక్ష్మి. కుంజా వీరభద్రమ్మ. బానోత్ వీరమ్మ. తదితరులు పాల్గొన్నారు