26 May, 2026 | 3:03 PM

రైతు సంక్షేమం కోసం కృషి చేయండి

26-05-2026 02:31 PM

బోథ్,మే26(విజయక్రాంతి): నూతనంగా నియమించబడిన మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు రైతు సంక్షేమానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు తేలేటి మోహన్ రెడ్డి డైరెక్టర్లు శ్రీ రామోజీ నారాయణ ఆత్రం నగేష్ లను సాల్వలతో సన్మానించారు.

ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవి బాధ్యతలు కట్టబెట్టిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ సోయం బాబూరావు బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్లకు కృతజ్ఞతలు తెలిపారు తాము రైతు సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సిరికొండ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు బొడ్డు దత్తాత్రేయ కుమారి సహకార సంఘం చైర్మన్ మందుల రమేష్ బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి పి సి సి ఎస్ సి సెల్ మాజీ రాష్ట్ర కన్వీనర్ అనుపట్ల సంజీవ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం పోతారెడ్డి తదితరులు ఉన్నారు