calender_icon.png 7 August, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ తరగతులు ఉపయోగించుకుని మంచి ఫలితాలు సాధించాలి

25-07-2025 01:35:01 AM

కలెక్టర్ జితేష్ వి పటేల్ 

భద్రాద్రి కొత్తగూడెం, జులై 24, (విజయ క్రాంతి):రాష్ట్ర ప్రభుత్వం ఖాన్ అకాడమి సంయుక్త నిర్వహణలో కేజీబీవీ విద్యార్థులకు 6 నుండి 12వ తరగతి వరకు భౌతిక, రసాయన శాస్త్రాలు, గ ణితం పై ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నదని, దీనిని విద్యార్థులు సమర్థవంతం గా వినియోగించుకొని మంచి విద్యాసామర్ధ్యాలు సాధించడంతో పాటు, పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సా ధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థిను లకు సూచించారు.

పాల్వంచలోని కేజీబీవీ విద్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన అక్కడ పిల్లలు ఖాన్ అకాడమీ ద్వారా ఏర్పాటైన ఆన్లైన్ తరగతులను, వాటిని పిల్లలు వినియోగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం విద్యాలయంలోని గ్రంథాలయాన్ని కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించి పిల్లలకు అవసరమైన పుస్తకాలను ఎక్కువగా తప్పించుకోవాలని ఏమేమి పుస్తకాల అవసరం పిల్లలకు ఉం డదు ఆ పుస్తకాల జాబితాను తనకు అందజేయాలని,

అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఏడు కంప్యూటర్లకు తోడు ఇంకా ఎన్ని కంప్యూటర్లు అవసరము తెలియజేస్తే వీటన్నింటినీ అందజేస్తానని కలె క్టర్ హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వరచారి, జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ అధికారి ఏ. నాగరాజు శేఖర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ఎస్ కే సైదులు, బాలిక విద్య కోఆర్డినేటర్ జె. అన్నామని, విద్యాసాక్ ఇంజనీరింగ్ అధికారులు, పాల్వంచ తాసిల్దార్ పాల్గొన్నారు.