26 May, 2026 | 3:33 PM

పంటలైన కొనండి.. లేదా చావ నైనా ఇవ్వండి

26-05-2026 02:38 PM

నిర్మల్ మే 26 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం(Sarangapur Mandal) స్వర్ణ గ్రామ రైతులు పంట కొనుగోల కోసం ఆందోళన నిర్వహించారు. మంగళవారం స్వర్ణ నిర్మల్ రహదారిపై చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేసి పంట సంచులను రోడ్డుపై పోసి రాస్తారోకో చేశారు. పంట చేతికొచ్చి నెల రోజులైనా మొక్కజొన్న వారి జొన్న కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్న ప్రభుత్వం పాలకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పంటలు అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని అయితే పంట అన్న కొనాలని లేకపోతె చావుకు అయినా అనుమతి ఇవ్వాలని ఆక్రోషం వెళ్లగక్కారు. ఈ లీడర్లు ఏ అధికారులు పట్టించుకోవడంలేదని మాకు చావే గతని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు