calender_icon.png 6 August, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శబరి ఎక్స్‌ప్రెస్ ప్రయాణ సమయం తగ్గింపు

25-07-2025 01:32:45 AM

వేగం పెంచి 1.45 గంటల మేర సమయం తగ్గిస్తూ నిర్ణయం

హైదరాబాద్, జూలై 24 (విజయ క్రాంతి): సికింద్రాబాద్-తిరువనం తపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ (నెం.17229, 17230) రైలులో ప్రయాణించే వారికి రైల్వేశాఖ శుభ వార్త అందించింది. ఈ రైలు ప్రయాణ సమయాన్ని 1.45 గంటల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రైలు వేగాన్ని పెంచనున్నట్టు దక్షిణ మధ్య ల్వే సీపీఆర్‌వో శ్రీధర్ వెల్లడించారు.

సికింద్రాబాద్ నుంచి నల్లగొండ, నడికుడి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పా డి, ఈరోడ్, కోయంబత్తూరు, త్రిసూ ర్, కొల్లాం తదితర స్టేషన్ల మీదుగా తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ వెళ్లే ఈ రైలు గతంలో 29.45 గంటల ప్రయాణ సమయం తీసుకు నేది.

ప్రస్తుతం వేగం పెంచిన తర్వాత ఈ రైలు 28 గంటల్లో సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం సెంట్రల్‌కు చేరుకోనుంది. ప్రయాణ సమయం తగ్గింపు ఈ నెల 29వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. తిరుపతి, శబరి మలై వెళ్లే భక్తులు పెద్దసంఖ్యలో ఈ రైలులో ప్రయాణాలు చేస్తుంటారు. ప్రయాణ సమయం తగ్గించడంపై భ క్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.