29 May, 2026 | 9:33 PM

గాలి దుమారానికి దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ

29-05-2026 04:11 PM

గాలిదుమారానికి దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ – తాడూర్, గోపాలరావుపల్లిలో వేగంగా పునరుద్ధరణ

తంగళ్ళపల్లి,మే 29(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో గురువారం రాత్రి వీచిన తీవ్ర గాలిదుమారం కారణంగా తాడూర్, గోపాలరావుపల్లి గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. 11 కెవి లైన్‌తో పాటు ఎల్‌టీలైన్‌లో మొత్తం 12 విద్యుత్ స్తంభాలు కూలిపోగా, ఒక ట్రాన్స్‌ఫార్మర్ కూడా నేలకూలింది. విషయం తెలిసిన వెంటనే విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లు వెంటనే స్పందించి మరమ్మతు పనులు ప్రారంభించారు. రాత్రంతా శ్రమించి తెల్లవారుజామున 3 గంటల వరకు పనులు కొనసాగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ పునరుద్ధరణ పనులను రాజన్న సిరిసిల్ల ఎస్‌ఈ వేణుగోపాల్, డీఈ అంజయ్య, ఏడీఈ గోపీనాథ్ పర్యవేక్షించారు. ఏఈ మధుకర్, తాడూర్ సర్పంచ్ రెడ్డిమల్ల సదానందం, గ్రామస్తులు, విద్యుత్ శాఖ సిబ్బంది కలిసి పనుల్లో పాల్గొన్నారు. స్థానికులు విద్యుత్ శాఖ సిబ్బంది తక్షణ స్పందనను అభినందించారు.