7 March, 2026 | 7:35 AM

టీ20 వరల్డ్ కప్ తో పవరేడ్ డీల్

06-03-2026 10:12 PM

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్‌లలో ఒకటైన ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్‌ 2026 ఉత్సాహంగా జరుగుతున్న వేళ పవరేడ్ భారత మార్కెట్‌లోకి అధికారికంగా ప్రవేశించింది. ది కోకా-కోలా కంపెనీకి చెందిన ఈ ఐకానిక్ స్పోర్ట్స్ హైడ్రేషన్ బ్రాండ్, టోర్నమెంట్ యొక్క అధికారిక క్రీడా పానీయంగా ఎంట్రీ ఇచ్చింది. ఈ భాగస్వామ్యం ద్వారా, కోకా-కోలా ఇండియా క్రీడలు, ఫిట్‌నెస్ కార్యకలాపాలు మరియు అభివృద్ధి చెందుతున్న జీవనశైలితో అనుసంధానమైన బ్రాండ్లతో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకుంది.

పవరేడ్, స్పోర్ట్స్ హైడ్రేషన్ సొల్యూషన్‌గా ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో విటమిన్ B3 మరియు ఎలక్ట్రోలైట్లు ఉండి, శరీరానికి అవసరమైన పనితీరు శక్తిని అందిస్తూ అధిక తీవ్రత కలిగిన శిక్షణ, పోటీ క్రీడలు మరియు చురుకైన జీవనశైలికి అనుకూలంగా ఉంటుంది. ఈ బ్రాండ్ భారత మార్కెట్‌లో రెండు రిఫ్రెషింగ్ ఫ్లేవర్ వేరియంట్లు- మౌంటెన్ బ్లాస్ట్ (బ్లూ) మరియు ఫ్రూట్ పంచ్ (రెడ్)లలో అందుబాటులోకి వచ్చింది. తక్కువ కేలరీల ఫార్ములేషన్‌తో రూపొందించిన ఈ వేరియంట్లు, ఆరోగ్యంపై దృష్టి పెట్టే వినియోగదారుల ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయి.

భారతదేశంలో క్రీడలు వీధులు, ఆట స్థలాలు, జిమ్‌లు మరియు రోజువారీ జీవితంలో భాగంగా ఉంటాయనీ, పవరేడ్ కూడా ఇదే తరహాలో వారి దినచర్యలో భాగమవుతుందని  స్పోర్ట్స్ & టీ కేటగిరీ, కోకాకోలా ఇండియా సీనియర్ డైరెక్టర్, మార్కెటింగ్ శ్రీమతి అంకితా మహ్నా చెప్పారు.  ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్‌ 2026తో భారత్ లో తాము అడుగుపెట్టడం మరింత సంతోషంగా ఉందన్నారు.  ఈ సందర్భంగా పవరేడ్ బ్రాండ్ అంబాసిడర్లుగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ , ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా నటించిన క్యాంపెయిన్ ను కూడా విడుదల చేశారు.