ప్రభల కొమ్మాల జాతర
- తరలివచ్చిన భక్తులు
ప్రభ బండ్ల ఊరేగింపు
మహబూబాబాద్, మార్చి 4 (విజయక్రాంతి) : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. జాతరలో ప్రధాన ఘట్టమైన ప్రభ బండ్ల కార్యక్రమం మంగళవారం రాత్రి అట్టహాసంగా సాగింది. వరంగల్ జిల్లా గీసుకొం డ మండలం కొమ్మాల గ్రామంలో నిర్వహించిన ప్రభ బండ్ల ఉత్సవం రాజకీయ వేదికగా నిలుస్తోంది.
ఏండ్ల తరబడిగా వస్తున్న సాం ప్రదాయం ప్రకారం నర్సంపేట, వరంగల్, పరకాల నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలకు చెందిన భక్తులు, రాజకీయ పార్టీల నేత లు పెద్ద ఎత్తున ఎడ్లబండ్లను ప్రభలతో అ లంకరించి తీసుకువచ్చి నరసింహుడికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్ర మంలోనే మంగళవారం రాత్రి ఆయా ప్రాం తాల నుంచి రూ. లక్షలు ఖర్చుపెట్టి సుందరంగా 40 నుంచి 50 అడుగుల ఎత్తులో ప్రభలను తీర్చిదిద్ది పోటాపోటీగా తరలివచ్చారు.
మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మె ల్సీ కొండ మురళి, నర్సంపేట ఎమ్మె ల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ సహా వివిధ రాజకీ య పార్టీల నేతలు ప్రభ బండ్లతో తరలివచ్చి కొమ్మాల నరసింహస్వామిని దర్శించుకున్నారు. కాగా ప్రభ బండ్ల ర్యాలీలో టపాసు లు పేలుస్తుండగా ప్రమాదవశాత్తు బీఆర్‌ఎస్‌కు చెందిన ఒక ప్రభ బండికి అగ్నిప్రమా దం సంభవించింది. ప్రజలు నీళ్లు చల్లి మం టలు ఆర్పారు.
ప్రారంభమైన గుంజేడు జాతర
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మం డలం గుంజేడులో గుంజేడు ముసలమ్మ జాతర బుధవారం అంగరంగ ప్రారంభమైంది. జాతరకు సంకేతంగా పూజారులు అడవి నుండి వనం రూపంలో అమ్మవారిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్టింపజేశారు. గుంజేడులో వనజాతర మూడు రోజులపాటు జరగనుంది.




