5 March, 2026 | 1:52 AM

జన్మదిన సందర్భంగా సర్పంచ్‌ను సన్మానించిన మాజీ జెడ్పీటీసీ

05-03-2026 12:28 AM

దోమకొండ, మార్చి 4 (విజయక్రాంతి): దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య జన్మదినం సందర్భంగా బుధవారం దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్ సన్మానించారు. దోమకొండ మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా నాయకులు తాటిపల్లి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు సీతారాం మధు, సంజీవరెడ్డి, అంకం బాలరాజ్, కమ్మరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.